అక్కినేని నవయువ సామ్రాట్ అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం తమిళంలో షూటింగ్ జరుపుకుంటున్న తాజా సినిమా ‘హీరో’ లో కథానాయకుడైన శివ కార్తికేయన్, దర్శకులు పీ ఎస్ మిత్రన్, మరియు కెమెరా మ్యాన్ జార్జ్ విలియమ్స్ కు నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఒక హోటల్ లో అఖిల్ గ్రాండ్ గా డిన్నర్ పార్టీని ఇవ్వడం జరిగింది. నటుడు శివ కార్తికేయన్ తో మంచి మిత్రత్వం ఉండడంతో అఖిల్ వారికి పార్టీ ఇచ్చినట్లు సమాచారం. కాగా నిన్న రాత్రి జరిగిన ఆ డిన్నర్ పార్టీ ఫొటోస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి….!!


