సూపర్ స్టార్ రజినీకాంత్ స్పీడ్ మాములుగా లేదు. ఏడు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా తలైవా వేగంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా అయితే ఆయన ఎనర్జీ డోస్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. మురగదాస్ డైరెక్షన్ లో ఇప్పటికే దర్బార్ సినిమా పూర్తి చేసిన తలైవా వెంటనే శివతో తన 168వ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేశాడు.
ఇక సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగాన్ని అందుకున్నాయి. దర్శకుడు శివ రీసెంట్ గా సినిమాలో నటీనటులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ నటీమణులు జ్యోతికతో పాటు మంజు వారియర్ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు.
అజిత్ తో వరుస బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న శివ ఇప్పుడు సూపర్ స్టార్ తో కలుస్తుండడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. డిఫరెంట్ షేడ్స్ లో తలైవా సినిమాలో స్పెషల్ గ కనిపించిననున్నట్లు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక రజినీకాంత్ దర్బార్ సినిమా 2020 పొంగల్ కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.