ఇండియన్ సినీ మార్కెట్ లో హాలీవుడ్ సినిమాల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. గత పదేళ్ళలో హాలీవుడ్ సినిమాలు మల్టీప్లెక్స్ ల నుంచి మాస్ సెంటర్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే విధంగా రిలీజవుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన మరో హాలీవుడ్ మూవీ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ రాబట్టింది.
పెద్దగా అంచనాలు లేకుండా అక్టోబర్ 2న ఇండియాలో రిలీజైన జోకర్ మూవీ పాజిటివ్ రివ్యూలను అందుకుంది. సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదట మల్టీప్లెక్స్ లలో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. అనంతరం మెల్లగా థియేటర్స్ సంఖ్యను పెంచుకొని కలెక్షన్స్ డోస్ కూడా పెంచుకుంది. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం జోకర్ ఇండియాలో 13రోజుల్లో 60కోట్లను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని మొదట ఎవరు ఉహించలేకపోయారు. జోకర్ మ్యాజిక్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. జోక్విన్ ఫీనిక్స్ జోకర్ పాత్రలో నటించిన విధానం సినిమాకి ఎంతో బలాన్ని ఇచ్చింది.
స్క్రీన్ ప్లే అండ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ మరో బూస్ట్ అనే చెప్పాలి. సినిమాకు ఫస్ట్ టాక్ ఎంతగా ఉపయోగపడుతుందో సినిమా కలెక్షన్స్ ని చూస్తే అర్ధమవుతోంది. దసరా సెలవులు కూడా బాగా కలిసొచ్చాయనే చెప్పాలి. మంచి సినిములొస్తే పోటీగా మరో మంచి సినిమా ఉన్నా కూడా ఆడియెన్స్ ఆదరిస్తారని జోకర్ నిరూపించింది. చూస్తుంటే సినిమా మరిన్ని కలెక్షన్స్ అందుకునేల కనిపిస్తోంది. 60 కోట్ల వరకు వచ్చిన జోకర్ ఇంకా ఆ నెంబర్ ని ఎంతవరకు తీసుకువెళతాడో చూడాలి.