యూఎస్ లో సైరా ‘మెగా’ రికార్డ్

0
788

మెగాస్టార్ నటించిన హిస్టారికల్ ఫిల్మ్ సైరా నరసింహా రెడ్డి రిలీజై రెండు వారాలు దగ్గరపడుతున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. హాలిడేస్ లో మంచి వసూళ్లను అందుకున్న సైరా సెకండ్ వీకెండ్ లో కూడా అదే ఫ్లోలో మంచి లాభాలను అందుకుంటోంది. ఓవర్సీస్ లో కూడా మెగా స్టార్ సాలిడ్ డాలర్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

ఇక యూఎస్ లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక లైఫ్ టైమ్ గ్రాస్ ను అందుకున్నారు. లేటెస్ట్ వీకెండ్ కలెక్షన్స్ తో సైరా నరసింహా రెడ్డి 2.5 మిలియన్ డాలర్స్ ని క్రాస్ చేసింది. ఈ కలెక్షన్స్ ద్వారా టాప్ 10 తెలుగు యూఎస్ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో సైరా నిలిచింది. గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమాతో మెగాస్టార్ $2 మిలియన్స్ ని దాటేశారు. ఇక ఇప్పుడు 2.5 మిలియన్ డాలర్స్ తో సరికొత్త మార్క్ ని అందుకున్నారు.

కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమాను యూఎస్ఏ లో స్నో ఫ్లేక్ సంస్థ రిలీజ్ చేసింది. ప్రస్తుతం కూడా సినిమా కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణాలో కూడా హాలిడేస్ ని పొడిగించడంతో సినిమా కలెక్షన్స్ కి మరింత ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఫైనల్ మెగాస్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నారని చెప్పవచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 2న తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీలో భాషల్లో ఒకేసారి రిలీజయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here