బాలీవుడ్ లో నాని జెర్సీ… హీరోగా షాహిద్ కపూర్

0
661

టాలీవుడ్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆ వార్తల్లో ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా ఒరిజినల్ కంటెంట్ ఫ్లో ఏ మాత్రం తగ్గకుండా అదే తరహాలో సినిమాని తెరకెక్కించాలని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ నిర్మాతతో చేతులు కలిపారు.

అల్లు అరవింద్ – దిల్ రాజు తో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ సంయుక్తంగా జెర్సీని బాలీవుడ్ లో నిర్మించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక సినిమాను తెలుగులో తెరకెక్కించిన కథ ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ తో కబీర్ సింగ్ గా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ జెర్సీ లో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.

ఇక తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ సినిమా డబ్బింగ్ రైట్స్ ని కొన్ని నెలల క్రితం దిల్ రాజు – అల్లు అరవింద్ కలిసి మంచి రేట్ కి సొంతం చేసుకున్నారు. ఇక సినిమా పాయింట్ బాలీవుడ్ ఆడియెన్స్ కి తప్పకుండ కనెక్ట్ అవుతుందని రీమేక్ చేయడానికి ఒక ప్లానింగ్ తో రెడీ అయ్యారు. 2020 ఆగస్ట్ 28న సినిమాను రిలీజ్ చేసేవిధంగా చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here