1971 ఇండో – పాక్ యుద్ధంలో వీర మరణం పొందిన యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ బయోపిక్ కి రంగం సిద్ధమైంది. గత కొంత కాలంగా ఈ బయోపిక్ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది. కేవలం 21 ఏళ్లలోనే శత్రు దేశాన్ని గడగడలాడించిన యువ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ పాత్రలో వరుణ్ ధావన్ కనిపించబోతున్నాడు.
మొదట్లో అరుణ్ బయోపిక్ లో వేరే హీరోలు నటిస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఫైనల్ గా చిత్ర యూనిట్ వరుణ్ ధావన్ ని ఫైనల్ చేసినట్లు ఒక క్లారిటీ ఇచ్చింది. బద్లాపూర్ సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకున్న చిత్ర యూనిట్ ఈ బయోపిక్ తో మరోసారి ఏకమవుతుండడం విశేషం. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో దినేష్ విజన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
21 ఏళ్ల వయసులోనే భారత ఆర్మీకి గుర్తిండిపోయే సేవలందించి శత్రుదేశంపై వీరోచితంగా యుద్ధం చేసిన అరుణ్ ఖేతర్ పాల్ కి మరణాంతరం పరమవీర చక్ర ను ప్రకటించారు. సినిమా టైటిల్ పై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.