ఇళయదళపతి విజయ్ ‘బిగిల్’ ట్రైలర్ రిలీజ్ ….!!

0
749

ఇళయదళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా బిగిల్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తేరి, మెర్సల్ సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన నయనతర హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది.

విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా, అలానే వృద్ధ వయస్కుడిగా రెండు రకాల పాత్రల్లో నటిస్తున్నట్లు ట్రైలర్ ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టగా, విజయ్ మార్క్ పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ట్రైలర్ లో ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. మొత్తంగా ఈ ట్రైలర్, సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెంచేసింది. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కల్పతి ఎస్ అఘోరమ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఇటీవల మహేష్ ఎస్ కోనేరు కొనుగోలు చేయడం జరిగింది. తెలుగులో విజిల్ పేరుతో అనువాదం అవుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో దీపావళి కానుకగా విడుదల చేయనుంది చిత్ర బృందం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here