ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మొదటివారంలో మెగాస్టార్ సినిమా చాలా ఏరియాల్లో మంచి కలెక్షన్లు రాబట్టింది ఇకపోతే సినిమా సెకండ్ వీక్ లో కూడా అదే ఫ్లోలో కలెక్షన్స్ సాధిస్తోంది. ఇప్పటివరకు హాలిడేస్ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చాయి.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు కర్ణాటక లో కూడా మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ తో సైరా కలెక్షన్స్ స్టాండెర్డ్ గా ఉన్నాయి. ముఖ్యంగా బెంగుళూరులో కూడా బుకింగ్స్ బావున్నాయి. సెకండ్ వీకెండ్ లో ఎపి తెలంగాణాలో సైరా మరోసారి హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చే అవకాశం కనిపిస్తోంది. సినిమాకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం కూడా బోనస్ లో ఉపయోగపడేలా కనిపిస్తోంది.
ఆర్టీసీ సమ్మె దృష్ట్యా తెలంగాణలో స్కూల్స్ కి కళాశాలలకు సెలవులను ఈ నెల 19వరకు పొడిగించారు. దీంతో ఈ హాలిడేస్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ కాలేజ్ కుర్రాళ్ళు సైరా వైపు తిరిగే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే.