కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది….!!

0
645

యంగ్ హీరో కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఖైది. ఇటీవల ఈ సినిమా తమిళ ట్రైలర్ రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని సోమవారం ఉదయం గం.10 ని.25 లకు అధికారికంగా యూట్యూబ్ లో రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీ లారీ డ్రైవర్ గా ఒక పక్కా మాస్ పాత్రలో నటిస్తున్నారు.

పూర్తిగా నైట్ ఎఫెక్ట్ లో చిత్రీకరించబడిన ఈ సినిమాలో కార్తీకి హీరోయిన్ కూడా లేకపోవడం విశేషం. సహజత్వానికి దగ్గరగా ఉండేలా తన సినిమాలు ప్లాన్ చేసే లోకేష్, ఈ సినిమాను కూడా ఎంతో అద్భుతంగా నాచురల్ గా తీసారని ఇటీవల కార్తీ ఈ సినిమా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. అలానే తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సత్యన్ సూర్య కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here