మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ప్రస్తుతం మంచి టాక్ తో మరియు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార, తమన్నా హీరోయిన్ లుగా నటించారు. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖుల నుండి ప్రశంశలు కురుస్తుండగా,
నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ చిత్రాన్ని తన కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా వీక్షించి మెగాస్టార్ ని మరియు సైరా టీమ్ ని అభినందిచడం జరిగింది. సైరా చిత్రం తనకు ఎంతో బాగా నచ్చిందని, నరసింహారెడ్డి గారి పాత్రలో చిరంజీవి గారు ఎంతో అద్భుతంగా నటించారని, మెగాస్టార్ మరియు ఆయన తనయ సుస్మిత గారి సమక్షంలో గవర్నర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది…!!