బాక్స్ ఆఫీస్: వార్ డబుల్ సెంచరీ

0
6323

బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వార్ సినిమా మొత్తానికి మరో మైల్ స్టోన్ ని అందుకుంది. ఎవరు ఊహించని విధంగా ఫాస్టెస్ట్ గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకుంటోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ నటించిన ఈ మల్టీస్టారర్ యాక్షన్ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగులో డబ్ చేసి సినిమాను రిలీజ్ చేశారు.

అయితే సినిమా ఫైనల్ గా డబుల్ సెంచరీ కొట్టేసింది. విడుదలైన 7 రోజుల్లోనే 200కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. గడిచిన ఈ ఏడూ రోజుల్లో డైలీ మినిమమ్ 20కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. మూడు రోజుల్లోనే 100కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి హీరోల కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందించిన చిత్రంగా వార్ నిలిచింది.

4 రోజుల్లో 125కోట్లు – 5 రోజుల్లో 150కోట్లు – 6 రోజుల్లో 175కోట్లు.. ఫైనల్ గా మొదటి వారం రోజుల్లో 200కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ ఏడాది టాప్ 5 గ్రాస్ ఫిల్మ్స్ లో వార్ స్థానం దక్కించుకుంది ఇంకా హాలిడేస్ మిగిలి ఉండడంతో భజ్ చూస్తుంటే 300కోట్ల మార్క్ ని కూడా అందుకునేలా కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here