వోగ్ షూట్ లో సూపర్ స్టార్ ఫేవరేట్ పిక్

0
346

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు మిలిటరీ మేజర్ రోల్ లో నటిస్తున్నారు. ఇక ఎప్పటికపుడు లేటెస్ట్ ఫాషన్ ట్రెండ్స్ ని ఫాలో అయ్యే మన సూపర్ స్టార్, ఇటీవల ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ కొరకు ఒక ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. లేటెస్ట్ ట్రేండింగ్ అవుట్ ఫిట్స్ తో మహేష్ ఇచ్చిన ఫ్యాషన్ స్టిల్స్ అదిరిపోయాయి.

ఆయన లుక్ ను చూసిన వారందరూ మహేష్ బాబుకు రోజురోజుకు వయసు మరింత తగ్గడంతో పాటు ఆయన గ్లామర్ మరింతగా పెరుగుతోంది అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక నేడు మహేష్ బాబు వోగ్ సంస్థకు తన తరపున కృతజ్ఞతలు తెల్పుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ట్వీట్ చేసారు. ‘వోగ్ షూట్ లో నా పిక్.  వారి లేటెస్ట్ ఫాషన్ ఫోటో షూట్ లో పాల్గొనడం, అలానే దానికి గొప్ప రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వోగ్ టీమ్ వారందరకీ నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ మహేష్ పోస్ట్ పోస్ట్ చేయడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here