లవ్లీ డ్రీమ్ లో ధృవ్ విక్రమ్

0
388

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్రమ్ నిత్యం ఎదో ఒక సినిమాతో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు తనయుడు ధృవ్ కూడా అదే ట్రాక్ వెళ్లాలని విక్రమ్ ఒక దారి సెట్ చేస్తున్నాడు. ఇకపోతే వీరికి సంబంధించిన ఒక క్యూట్ అండ్ లవ్లీ పిక్ నెటీజన్స్ ని ఆకట్టుకుంటోంది. తండ్రి కొడుకులిద్దరు ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోతున్నారు.

చండి ఘర్ ఎయిర్ పోర్ట్ లో విమానం వచ్చే గ్యాప్ లో విక్రమ్ ఓ కునుకు తీశాడు. రెండు పదుల వయసు దాటిన కొడుకిని కూడా రెండేళ్ల బాబులా భుజంపై ఆప్యాయంగా పడుకోబెట్టుకొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రి కొడుకులు మంచి డ్రీమ్ లో ఉన్నట్లు నెటీజన్స్ పాజిటివ్ కామెంట్ చేస్తున్నరు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. ముందుగా ధృవ్ ఆదిత్య వర్మతో రాబోతున్నాడు.

అర్జున్ రెడ్డికి రీమేక్ గా తెరకెక్కిన ఆ సినిమా నవంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక విక్రమ్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా మరో కొత్త కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘డిమాంట్‌ కాలనీ, ఇమైక్క నొడిగళ్‌’ వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్షన్ లో విక్రమ్ ఒక డిఫరెంట్ సినిమా చేయనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here