నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘దహిణి ది విచ్’ చిత్రానికి గాను జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడు పురస్కారం

0
4
JD Chakravarthy Wins Best Actor at Norway International Film Festival
JD Chakravarthy Wins Best Actor at Norway International Film Festival

నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘దహిణి ది విచ్’ చిత్రానికి గాను జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడు పురస్కారం

విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి నటించిన ‘దహిణి ది విచ్’ చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు ధీటుగా నిర్వహించే నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘దహిణి ది విచ్’ చిత్రానికి గాను జేడీ చక్రవర్తికి ఉత్తమ నటుడు పురస్కారం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 150 నామినేషన్స్ రాగా బెస్ట్ లీడ్ యాక్టర్ కేటగిరీలో జేడీ చక్రవర్తికి ఈ అవార్డ్ రావడం గొప్ప విషయం.ఇప్పటికే ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ చిత్రం అనేక అవార్డ్స్ ను కైవసం చేసుకుంది. తాజాగా నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘దహిణి’ ఉత్తమ చిత్రం అవార్డ్ ను సైతం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖు నటులు ఈ నామినేషన్ లో ఉండగ భారతీయ నటుడు జేడీ చక్రవర్తి కి ఈ అవార్డ్ దక్కడం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా

జేడి చక్రవర్తి మాట్లాడుతూ .. ‘ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన హేమాహేమీలు రూపొందించిన చిత్రాలతో పోటీపడి ‘దహిణి’ ఉత్తమ చిత్రం అవార్డ్ దక్కించుకోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమ కి గర్వ కారణం , అలానే దాదాపు 150 నామినేషన్లలో వరల్డ్ వైడ్ నటులు ఉండగా , బెస్ట్ లీడ్ యాక్టర్ అవార్డ్ నన్ను వరించడం నన్నెంతో ఆనందానికి గురి చేసింది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ను నా కిచ్చిన దర్శకుడు రాజేష్ టచ్ రివర్ కి, అలానే నార్వే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు.

ఇంతకుముందు ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పలు గౌరవాలు దక్కించుకుంది. ఆస్ట్రేలియా టైటాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌, స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌, ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం దాదాపు 18 అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించిన ‘దహిణి ది విచ్’ సినిమాలో జేడీ చక్రవర్తితోపాటు.. తనిష్ట ఛటర్జీ, శ్రుతి జయన్ కీలకపాత్రలలో నటించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here