కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కెరీర్ లో మొదటిసారి డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా మారి శ్రీనివాస్ తెరకెక్కించిన మొదటి సినిమా ‘భాగ్య నగరవీధుల్లో గమ్మత్తు’. ‘మంచి రసాగుల్లా లాంటి సినిమా’ అంటూ ఓ క్యాప్షన్ తో రానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రెడీ చేశారు.
శనివారం ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు. గతంలో జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు పనిచేసిన రైటర్ ఈ సినిమాకు వర్క్ చేశారు. హీరోగా ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు నిర్మాతగా దర్శకుడిగా తన టాలెంట్ ని నీరూపించుకోబోతున్నాడు. ఫస్ట్ లుక్ ద్వారా సినిమా ఏ విధంగా రూపొందుతుందో అర్ధమవుతుంది. ఫ్లైయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు పరమ్ సూర్యన్షు కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించాడు.


