దేవకన్య పొరపాటున గ్లామర్ లుక్ లో మాయ చేస్తోందా అన్నట్టుగా మతిపోగొడుతూన్న ఈ బ్యూటీ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 2005 నుంచి హీరోయిన్ గా కొనసాగుతున్న ఆండ్రియా జెర్మీయా నటిగానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పలుమార్లు సత్తా చాటింది. తనలో మంచి మ్యూజిషియన్ కూడా ఉన్నట్లు నిరూపించిన ఈ హాట్ భామ సినిమాల్లోనే కాకుండా ఇలా హాట్ ఫోటో షూట్స్ తో కూడా కుర్రకారును తనవైపుకు తిప్పుకుంటోంది.
గులాబీ రంగులో కలగలిపిన డిఫరెంట్ డ్రెస్ లో మెరుస్తున్న ఈ గ్లామర్ ఫ్లవర్ పెద్ద దొంగే అని చెప్పాలి. ఎందుకంటే వయసు మూడు పదులు దాటి మూడేళ్లు అవుతున్నా..మొన్ననే టీనేజ్ దాటినా వయ్యారిలా మోసం చేస్తోంది. ఓ విధంగా అందానికి వయసుతో సంబంధం లేదనే పాజిటివ్ మెస్సేజ్ కూడా ఇస్తోంది. గ్లామర్ డోస్ ఎక్కువకాకుండా సమపాళ్లలో అందాల్ని వడ్డించే ఈ భామ ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది. అందులో కా: ద ఫారెస్ట్ అనే సినిమాలో ఆండ్రియా మెయిన్ లీడ్ లో నటిస్తోంది.


