బుల్లితెరలో మిమిక్రి ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి వెండితెరపై స్టార్ హీరో రేంజ్ కు వచ్చిన కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. అతను ఎంత కష్టపడి పై కొచ్చాడో తమిళ ఆడియెన్స్ ని ఎవరిని అడిగినా చెబుతారు. ఇక కోలీవుడ్ జనాల ప్రేమకు ఈ హీరో కూడా బానిసైపోయాడు. అందుకే ఎలాంటి సామాజిక అంశంపైన అయినా ధైర్యంగా తన గొంతు విప్పుతాడు. శుక్రవారం ‘నమ్మ వీటు పిళ్ళై’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
తాను రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతూ.. “నటులు మాత్రమే కాదు, ఎవరైనా రాజకీయాలకు రావచ్చు. కానీ ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. నా సినీ కెరీర్ కు సరైన సమయం ఇదే. నా నటన మరియు నిర్మాణ సంస్థలతో నేను సంతృప్తి చెందుతున్నా. ఈ పెద్ద పరిశ్రమలో నేను చాలా నేర్చుకుంటున్నాను” అని శివ కార్తికేయన్ వివరణ ఇచ్చాడు. అలాగే “విజయం మీ తలపైకి రావద్దు” అని ఓ మంచి జీవిత సత్యాన్ని కూడా చెప్పాడు.