సామజవరగమన ఫుల్ సాంగ్.. టైమ్ ఫిక్స్

0
1024

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న అల వైకుంఠపురములో.. మొదటి సాంగ్ ఎనౌన్సమెంట్ వచ్చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనలో థమన్ కంపోజ్ చేసిన సామజవరగమన అనే ఆ సాంగ్ నిన్నటి నుంచి తేగ ఉరిస్తోంది. యంగ్ సింగర్ సిద్ శ్రీరామ్ అలపించిన చిన్న ప్రొమో తో లవ్లీగా ఆకట్టుకున్న ఆ ఫుల్ సాంగ్ ని శనివారం వదలనున్నారు.

ఉదయం 10 గంటలకు సాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ – పూజా హెగ్డే ల అట్రాక్టివ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్, హారిక హాసిని  బ్యానర్స్ ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here