తారక్ – రాజమౌళి: అప్పుడలా.. ఇప్పుడిలా..

0
1443

కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో.. పైన కనిపిస్తున్న స్టిల్స్ ని చూస్తుంటే ఈజీగా అర్ధమవుతుంది. అలాగే ఆశ్చర్యం కూడా కలగక మానదు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజయ్యి నేటితో 18 సంవత్సరాలు పూర్తయ్యింది. 2001 సెప్టెంబర్ 27న రిలీజైన ఆ సినిమా ద్వారా వెండితెర డైరెక్టర్ గా రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

రామోజీ ఫిల్మ్ సిటీ లో ఆ మూవీ తెరకెక్కుతున్న సమయంలో తారక్ తో గడిపిన క్షణాల్ని మరచిపోలేని జక్కన్న అదే స్పాట్ లో మరోసారి జూనియర్ తో ఇలా కనిపించారు. దీంతో యాదృచ్చికంగా తాము కలిశామని చెబుతూ.. చాలా మార్పులు జరిగినా జక్కన్న తో షూటింగ్ అంటే ఉండే ఫన్ మాత్రం మారలేదని తారక్ పోస్ట్ చేయగా, అలాగే అప్పటికి ఇప్పటికి, తారక్ బరువు తగ్గాడని తనకి వయసు పెరిగిందని కానీ ఇద్దరం పరిణితి చెందామని జక్కన్న ఒక స్పెషల్ ఫోటోని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తారక్, రామ్ చరణ్ తో కలిసి RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here