మొదలు కానున్నమణిరత్నం డ్రీం ప్రాజెక్ట్

0
954

మాస్టర్ డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు పొన్నియిన్ సెల్వన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. విక్రమ్ – కార్తీ – జయం రవి వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టనున్నారు. థాయిల్యాండ్ – తమిళనాడు లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. సీనియర్ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ తో పాటు కీర్తి సురేష్ ఆర్.పార్తీపన్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here