ఇస్మార్ట్ స‌ర్‌ప్రైజ్..నీ థియేటర్లో మళ్ళీ నా బొమ్మ

0
1222

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ఇస్మార్ట్ శంకర్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక థియేటర్స్ లో కేకలు పెట్టించాడనికి మరోసారి చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. పూరి బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ స‌ర్‌ప్రైజ్ ఉందని చెప్పిన ఇస్మార్ట్ టీమ్ ఇస్మార్ట్ శంకర్ ని రీ రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

కో ప్రొడ్యూసర్ ఛార్మి ఈ విషయంపై అధికారికంగా వివరణ ఇచ్చారు. నీ థియేటర్ల మళ్ళీ నా బొమ్మ అంటూ.. 27, 28, 29 తేదీల్లో ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే థియేటర్స్ లిస్ట్ ని కూడా ఇచ్చారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. పూరి కనెక్ట్స్ లో నిర్మించిన ఈ సినిమాలో నభా నటేష్ – నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు.

iSmart Shankar Theaters Telangana
Dilshuknagar– Venkatadri
Warangal- Laxman
Karimnagar-Tirumala
Khammam- Aditya
Kazipet- Bhavani

iSmart Shankar Theaters Andhra
Rajamundry- Urvasi
Kakinada- Devi (Screen 3)
Tirupathi- Vikyath
Guntur- Swamy
Vizag- Gokul

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here