ముట్టుకుంటే మాసిపోతుందేమో అనేలా తమన్నా సొగసులు గత కొన్నేళ్లుగా వెండితెరపై మెరుస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు గ్లామర్ తో సరికొత్తగా కనిపిస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తేనే స్టార్ హీరోయిన్స్ గా నిలదొక్కుకుంటారు. ఆ విధంగా రాణిస్తున్న నటీమణుల్లో తమన్నా కూడా ఒకరు. సైరా సినిమాలో లక్ష్మి పాత్రలో మెరవనున్న తమన్నా అందంగా కనిపించేందుకు గల కారణాన్ని తెలిపింది.
‘ఫిట్ నెస్ కోసం మెయిన్ గా యోగాతో రోజును స్టార్ట్ చేసి వ్యాయామం అనంతరం వైట్ ఎగ్ ఆమ్లెట్ – బ్రౌన్ బ్రేడ్ తింటాను. నెక్స్ట్ టిఫిన్ లో దోస – ఇడ్లి – ఓట్ మీల్ లాగించేస్తా. ఇక మధ్యాహ్నం మెన్యులో కప్పు రైస్ తో కూరగాయలతో కలగలిపిన కూరలు తినేసి నైట్ లో గ్రిల్డ్ చికెన్ – ఫిష్ – అలాగే వెజిటేబుల్స్ ఉండేలా డైట్ మెయింటైన్ చేస్తుంటా. చర్మం సౌమ్యంగా ఉండేందుకు వీలైనన్ని వాటర్ తాగేసి బజ్జోవడమే’ అని తమన్నా తన డైలీ షెడ్యూల్ గురించి సింపుల్ గా వివరించింది.


