వేణుమాధవ్ కు ఎల్బీ శ్రీరామ్ హార్ట్ టచింగ్ ట్రిబ్యూట్…..!!

0
979

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ నేటి మధ్యాహ్నం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న వేణుమాధవ్ ను రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత విషమించడంతో ఆయనను యశోద ఆసుపత్రిలో చేర్చారు బంధువులు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదు. నేడు ఆయన మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

పలువురు సినిమా ప్రముఖులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. రచయిత మరియు నటులైన ఎల్బీ శ్రీరామ్ , వేణు మాధవ్ కు ఒక హృద్యమైన డైలాగ్ తో కన్నీటి వీడ్కోలు పలికారు. ‘నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా వేణు,… అగు, నాకు కొంచెం నవ్వు ఇచ్చి వెళ్ళు,,వచ్చాక తిరిగి ఇచ్చేస్తా’ అంటూ ఆయన ఒక డైలాగ్ ని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ డైలాగ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివ దేహాన్ని రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫిలిం ఛాంబర్ లో ఉంచి, అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here