మెగాస్టార్ ఫ్యాన్స్ కి సైరా నరసింహా రెడ్డి టీమ్ నుంచి బ్యాక్ టూ బ్యాక్ సర్ప్రైజ్ లు అందుతున్నాయి. మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ఎంతో దూరంలో లేదు. అయితే ఆ కాస్త సమయంలో ఓపికతో ఉండే అభిమానులకు మంచి ఎనర్జీ లాంటి టీజర్ అండ్ ట్రైలర్స్ ని వదులుతున్నారు. సినిమా సెకండ్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
సినిమాకు సంబంధించిన ద బ్యాటిల్ ఫీల్డ్ పేరుతో ట్రైలర్ 2 ని రిలీజ్ చేయనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సెకండ్ ట్రైలర్ ని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. మరి ఆ యుద్ధ సన్నివేశాలతో కూడిన ట్రైలర్ లో ఏముందో తెలియాలంటే మరికోన్నీ గంటలు వెయిట్ చేయాల్సిందే. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమాని నిర్మించారు.


