కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అభిమానుల మనసును కదిలించాడు. తన మాటలతో తనకు ఫ్యాన్స్ పై ఉన్న మమకారాన్ని చూపించాడు. దయచేసి అభిమానులను కొట్టకండి అంటూ వారి ఆగ్రహంలో అర్ధం ఉందని ఆ విషయం నాకు తెలుసనీ రీసెంట్ గా జరిగిన బిగిల్ ఆడియో వేడుకలో తెలిపారు. అట్లీ డైరెక్షన్ తెరకెక్కిన బిగిల్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. రీసెంట్ గా కటౌట్ పడి మృతి చెందిన శుభశ్రీ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఘటనపై అధికారులు అరెస్ట్ చేయాల్సిన వారిని చేయకుండా బ్యానర్లు అతికించిన వారిని ,పోస్టర్స్ చించిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. దయచేసి భిమానులను కొట్టకండి,. ఎంతో అభిమానంతో పోస్టర్స్, కటౌట్స్ ని ఏర్పాటు చేసుకుంటారు. అవి చించితే వారికి కోపం రావడం న్యాయమే. వారు పడే బాధ నాకు కూడా కలుగుతుంది అని విజయ్ అభిమానులపై తనకున్న ప్రేమను వివరించాడు.


