మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మూవీ గద్దలకొండ గణేష్. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ అంచనాలు అందుకుని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతోంది. వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించాడు. ఈ సినిమాపై కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక కొందరు సినిమా ప్రముఖులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు.
నేడు దర్శకేంద్రులు కె రాఘవేంద్ర రావు గారు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా గద్దలకొండ గణేష్ సినిమాపై ప్రశంశలు కురిపించారు. నేడు గద్దలకొండ గణేష్ సినిమా చూసాను, అంతటి మాస్ పాత్రలో వరుణ్ తేజ్ పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా నటించారు. ఇక సినిమాను మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో దర్శకుడు హరీష్ పూర్తి సక్సెస్ అయ్యారని, అలానే సినిమాలో వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ అయితే విజువల్ గా ఎంతో బాగుందని, ఆ సాంగ్ లో పూజ హెగ్డే ఎంతో బాగా కన్పించిందని ఆయన తన పోస్ట్ లో తెల్పడం జరిగింది….!!


