అవును.. జీవితాంతం నటించాలని ఉంది: పూర్ణ

0
408
Poorna About Her Acting Career

మలయాళం సినిమాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుత హీరోయిన్స్ కంటే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ గా అడుగులు వేస్తోంది. అవును1, 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ భామ అసలు పేరు షమ్నా కాసిం. ఇకపోతే ఈ యాక్టర్ నటనలో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాలని బలంగా కోరుకుంటోంది. జీవితాంతం సినిమాలతోనే ఉండాలని ఆశపడుతోంది.

ఇటీవల కాప్పాన్ సినిమాలో సముద్రఖనికి జోడిగా కనిపించింది. అయితే హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తూనే ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించడానికి గల కారణాన్ని తెలిపింది. ‘సినిమాలో పాత్ర చిన్నదైనా సరే ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటే అది హీరోయిన్ పాత్ర కంటే ఎక్కువ గుర్తింపు అందేలా చేస్తుంది. హీరోయిన్ గానే కనిపించాలన్న ఆలోచన మారింది. చిన్న చిన్న పాత్రలు కొన్నిసార్లు కథలో కీలకంగా మారతాయి. అలాంటి పాత్రల్లో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని పూర్ణ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here