ఆస్కార్ బరిలో డియర్ కామ్రేడ్

0
564
Dear Comrade In Oscar Race

ఫిల్మ్‌ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలుగు సినిమా ఆస్కార్ బరిలో పోటీపడుతోంది. విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రం ఈ ఏడాది జులైలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్న 28 భారత చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీ లో ఆస్కార్ నామినేషన్స్ కోసం స్క్రీనింగ్  చేయనున్నారు. 28 సినిమాల్లో బెస్ట్ సినిమా ఆస్కార్ బరిలో నిలవనుంది. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్యక్షురాలిగా ఉన్న జ్యూరీ సినిమాలను వీక్షిస్తున్నారు. మరి ఈ క్యాటగిరిలో ఏ సినిమా ఆస్కార్ అందుకుంటుందో చూడాలి. ఇక డియర్ కామ్రేడ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో డియర్ కామ్రేడ్ ఒకేసారి రిలీజయిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here