డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ నటించిన చివరి చిత్రం ‘సాప్ట్ వేర్ సుధీర్’

0
552
Siva Prasad Last Film Software Sudheer

ప్రముఖ నటులు, దర్శకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘సాప్ట్ వేర్ సుధీర్’. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ – ‘డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ గారు మా చిత్రంలో మంత్రిగా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయన మరణం మాకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అన్నారు.

సుడిగాలి సుధీర్‌,ధన్యా బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here