ఆస్కార్ అవార్డ్స్ లో గల్లీ బాయ్… టైమ్ ఆయేగా

0
403

రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో జోయా అక్తర్‌ తెరకెక్కించిన చిత్రం గల్లీ భాయ్‌. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో నిర్మించిన ఈ మ్యూజికల్ డ్రామా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. డైరెక్ట్ గా సినిమా హాలీవుడ్ సినిమాల కు ధీటుగా పోటీలో నిలవడం విశేషం.

84కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 238.16కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ముంబై మురికివాడకు చెందిన ఒక సాధారణ యువకుడిగా రణ్ వీర్ ర్యాపర్ గా నటించిన విధానానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సింగర్ కావాలని కలలు కనే కాలేజి కుర్రాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ర్యాపర్ గా ఎదుగుతాడు. సినిమాలో ప్రతి పాట చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరిని కదిలించాయి. ముఖ్యంగా టైమ్ ఆయేగా సాంగ్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యింది. ఇక ఫైనల్ గా ఆస్కార్ పోటీలో నిలిచిన సినిమా ఎంతవరకు గుర్తింపు అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here