ధనుష్ – రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓం’ నుంచి రిలీజైన సెకండ్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్

0
1

ధనుష్ – రాజ్‌కుమార్ పెరియసామి కాంబోలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓం’ నుంచి రిలీజైన సెకండ్ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్

‘వీళా వీర‌’ అంటూ తమిళంలో.. ‘వీర వీర’ అంటూ తెలుగు, హిందీలో ఆకట్టుకుంటోన్న పాట‌

వెర్స‌టైల్ స్టార్ ధనుష్ హీరోగా, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓం – చాప్టర్ 1: ఉదిరం’ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘వీళా వీర’కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ, సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. హీరో ప‌వ‌ర్‌, పరాక్రమం, గంభీరమైన వ్యక్తిత్వం, వీరోచిత విన్యాసాలను ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఉత్సాహభరితమైన ప్రదర్శన, హీరో పాత్రను శక్తిమంతంగా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.  

ఈ పాటకు సాయి అభ్యంకర్ సంగీతం అందించడంతో పాటు టిప్పుతో కలిసి ఆలపించారు. తెలుగులో సాయి అభ్యంక‌ర్‌, రితేష్ జి రావ్‌.. హిందీలో సాయి అభ్యంక‌ర్‌, రితేష్ జి రావ్‌, పాట‌ను పాడారు. అలాగే త‌మిళంలో అరుణ్ శ్రీనివాసన్.. తెలుగులో కాస‌ర్ల‌శ్యామ్.. హిందీలో కుమార్ సాహిత్యాన్ని అదించారు.   ఉత్సాహభరితమైన సంగీతం, గంభీరమైన గాత్రం ఈ పాటకు మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా చేస్తున్నాయి. తమిళంలో ‘వీళా వీరా’ పేరుతో విడుదలైన ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో ‘వీరా వీరా’ పేరుతో విడుదల చేశారు.

ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రద్ధా అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వండర్‌బార్ ఫిల్మ్స్‌పై ధనుష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ధనుష్, రాజ్‌కుమార్ పెరియసామి కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ అయ్యాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ధ‌నుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తోన్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలుత ధనుష్ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘ఓం ఫస్ట్ స్ట్రైక్’ వీడియో.. తర్వాత బర్మా కార్తికేయన్‌గా మమ్ముట్టిని పరిచయం చేసిన వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఇప్ప‌టికే రిలీజైన ఫస్ట్ సాంగ్‌కు చాలా స్పందన లభించగా, తాజాగా విడుదలైన రెండో పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ అంచనాలను పెంచుతుండటంతో, వెండితెరపై ధనుష్, మమ్ముట్టి కలయికను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి కె. ఎళిల్ అరసు సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్. కళైవాన‌న్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎ.పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా, యానిక్ బెన్, కెచా ఖంపక్డీ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

భారీ అంచనాల మధ్య ‘ఓం – చాప్టర్ 1: ఉదిరం’ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here