కార్తికేయ ’90 ఎమ్ ఎల్’ ఫస్ట్ లుక్ టీజర్ – యూత్‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌

0
666

ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుమ్మకొండ కార్తికేయ, ఆ సినిమాలో ఆకట్టుకునే నటనతో మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత హిప్పీ, గుణ 369 వంటి డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకున్న కార్తికేయ, ఇటీవల నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక నెగటివ్ క్యారెక్టర్ లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం తన హోమ్ ప్రొడక్షన్ లో 90 ఎమ్ ఎల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు కార్తికేయ. ఇంతకముందు ఆర్ఎక్స్ 100 సినిమాను నిర్మించిన తమ సంస్థ నుండి అతి త్వరలో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.

నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను యూత్‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, విభిన్నమైన కథ మరియు కథనాలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇకపోతే నేడు హీరో కార్తికేయ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ‘నా కడుపున దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో టీజర్ ప్రారంభం అవుతుంది.

‘కాళిదాస్ లాంటి ఒక రైటర్ పుట్టాలని కోరుకో, ఏసుదాస్ లాంటి ఒక సింగర్ పుట్టాలని కోరుకో, కానీ దేవదాస్ లాంటి ఒక డ్రింకర్ ని అంటూ వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో హీరో ఇంటెన్సిటీని తెలియచేసేలా ‘ డీజిల్ తో నడిచే బండిని చూసుంటావు, పెట్రోల్ తో నడిచే బండిని చూసుంటావు, ఇది లిక్కర్ తో నడిచే బండి, గుద్దితే అడ్రస్ ఉండదు అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ మొత్తం టీజర్ కె హైలైట్. మంచి ఎంటర్టైనింగ్ మరియు యాక్షన్ సీన్స్ తో సాగిన ఈ టీజర్, సినిమాపై మరిన్ని అంచనాలు పెంచిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ టీజర్ మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాగా ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here