సైరా కి సల్మాన్ విషెస్

0
807

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఒకేసారి అన్ని భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ప్రశంసలు అందుకుంటోంది. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ పాత్ర ద్వారా మంచి క్రేజ్ నెలకొంది. ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సైరాకి మరింత బూస్ట్ ఇచ్చాడు.

చాలా కాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సల్మాన్ ఖాన్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమా తెలుగులో ప్రేమ లీలగా రిలీజయినప్పుడు చరణ్ సల్మాన్ వాయిస్ కి డబ్బింగ్ చెప్పాడు. రామ్ చరణ్ నిర్మించిన సైరా సినిమాకు సల్మాన్ తన బెస్ట్ విషెస్ ని అందించారు. అలాగే మెగాస్టార్ కి కూడా సినిమా మంచి విజయాన్ని అందించాలని సైరా హిందీ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సైరా ట్రైలర్ బాలీవుడ్ లో మరింత హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here