ఫీట్ అప్ విత్ ద స్టార్స్ ” మీ ఫేవరేట్ స్టార్ ని మరింత దగ్గర చేస్తుంది….లక్ష్మిమంచు

0
548

డిజిటల్ మీడియా రెవల్యూషన్ చాలా వినోదాలను అందుబాటులో కి తెస్తుంది. ఎంటర్ టైన్మెంట్ పరిధులు పెంచుతూ, సరికొత్త వినోదాలను పరిచయం చేస్తుంది. అలాంటి వూట్ ఆప్ ప్రెజెంట్స్ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ ప్రోగ్రాం కి మంచు లక్ష్మీ హోస్ట్ గా రాబోతున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ షో అనుభవాలు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా
లక్ష్మిమంచు మాట్లాడుతూ – “ఇప్పటి వరకూ నేను చేసిన షోస్ లో ఈ ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’ భిన్నమైనది. ఈ షో కోసం స్టార్స్ ని కలిసినప్పుడు నైట్ డ్రెస్ లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్య పోయారు, కొందరు ఉత్సాహం చూపించారు. బాలీవుడ్ లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షోలో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షోకి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్ లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారి లో ప్రతి రోజు ఎదో చేంజ్ వస్తుంది. వారి మాటలు, అనుభవాల్లో నుంచి వస్తాయి.
ఉదాహరణకు : సమంతా గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం.. కానీ ఆమె నాగ చైతన్య గురించి ఈ షో లో మాట్లాడిన విషయాలు మీ కు సర్ప్రైజ్ గా ఉంటాయి. వరుణ్ తేజ్ ఈ షో లో కొత్త గా కనబడతాడు. ఆ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ షో ని బాగా ఎంజాయ్ చేశారు. స్టార్స్ వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళుతుంది. ఈ షోతప్పకుండా బిగ్ సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. ఈ ఎపిసోడ్స్ ఈ నెల23 నుండి వూట్ ఆప్ లో అందుబాటులో ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త స్టార్ తో మిమ్మల్ని అలరిస్తాను’అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here