‘జిగర్తాండ’ మూవీ లవర్స్ కి ‘వాల్మీకి’ డైరెక్టర్ హరీష్ శంకర్ మెసేజ్…..!!

0
615
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా సినిమా వాల్మీకి రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించిన జిగర్తాండ అనే మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరేకేక్కిస్తున్నారు. అయితే ఆ సినిమా లవర్స్ కు నేడు ‘వాల్మీకి’ డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక మెసేజ్ ని అందించారు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన సక్సెస్ఫుల్ మూవీ జిగర్తాండను తెలుగు నేటివిటీకి తగ్గట్లు, అలానే హీరో వరుణ్ తేజ్ ఇమేజికి సరిపోయే విధంగా కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించడం జరిగిందని, తప్పకుండా మీరు కూడా ఆ సినిమా రీమేక్ గా వచ్చిన మా వాల్మీకిని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తన మెసేజ్ లో తెలిపారు. కాగా ప్రస్తుతం ఆయన చేసిన ప్రకటన పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది……!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here