రిలీజ్ తోనే వార్ న్యూ రికార్డ్

0
711

బాక్స్ ఆఫీస్ ఫైటర్స్ గా క్రేజ్ తెచ్చుకున్న హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ మొదటిసారి కలిసి నటించిన యాక్షన్ మూవీ వార్. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ట్రైలర్ అలాగే సాంగ్స్ ఆడియేన్స్ లో అంచనాల డోస్ ని పెంచాయి. ఇకపోతే సినిమా రిలీజ్ ని కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 4400+ స్క్రీన్స్ లలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మొదటిసారి యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ దేశమంతటా హృతిక్ సినిమాను అత్యధిక లొకేషన్స్ లో రిలీజ్ చేస్తోంది. ఇదొక సరికొత్త రికార్డ్. హిందీ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడంతో ఆ విషయం ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. దీంతో మొదటిరోజూ కాలెక్షన్స్ కూడా సాలీడ్ గా ఉండే అవకాశం ఉంది. మరి సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన వార్ సినిమాలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here