రెండు వారాల్లో రూ.424 కోట్లు కొల్లగొట్టిన రెబల్ స్టార్ ‘సాహో’

0
3168
Saaho Two Weeks Gross

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన సాహో తొలిరోజు నుండి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించారు.

ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, నేటితో సక్సెస్ఫుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.424 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ను సాధించినట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాహో సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తూ మూడో వారంలోకి ప్రవేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here