స్టార్ హీరో గోపిచంద్ నుంచి మరో యాక్షన్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఆడియెన్స్ ఈ హీరో నుంచి కోరుకునే అసలైన యాక్షన్ మూవీ చాణక్య దసరా కానుకగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమ అన్ని వర్గల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా చిత్ర యూనిట్ మంచి సాంగ్స్ తో ప్రమోషన్ డోస్ పెంచుతోంది. రీసెంట్ గా డార్లింగ్ సాంగ్ తో ఆకట్టుకున్న చాణక్య టీమ్ ఇప్పుడు “ఓ మై లవ్” రొమాంటిక్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసింది.
విజువల్స్ లో గోపిచంద్ – మెహ్రీన్ కి సంబంధించిన లుక్స్ సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. లిరిక్స్ లవ్ మూడ్ లోకి తీసుకెళ్ళే విధంగా ఉన్నాయి. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ రొమాంటిక్ పాటకు శ్రీ చరన్ పాకల మ్యూజిక్ అందించారు. ఇక తిరు డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. గోపిచంద్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన టీజర్ కి కూడా మాంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఇప్పుడు సాంగ్స్ తో చాణక్యపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇక నెక్స్ట్ విడుదలయ్యే ట్రైలర్ సినిమాపై ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.


