సాధారణంగా స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్ ని స్పెషల్ గా ఏర్పాటు చేసిన సెట్స్ లలో చేయడానికి కంఫర్ట్ గా ఫీలవుతుంటారు. ఇక సినిమా కథ డిమాండ్ చేస్తే పలుమార్లు రియల్ లొకేషన్స్ లో చేయడానికి సిద్ధమవుతుంటారు. కానీ నిజమైన 100 లొకేషన్స్ లలో సినిమా షూటింగ్ చేయాలంటే సాధ్యమయ్యే పనేనా?. అందుకు సమాధానంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ సిద్ధమవుతున్నాడు. రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేసి సరికొత్త కిక్ ఇవ్వనున్నాడు.
అమీర్ ఖాన్ త్వరలో ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీని స్టార్ట్ చేయబోతున్నాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. అయితే ఇండియాలో మొత్తంగా వంద లొకేషన్స్ లో సినిమా షూటింగ్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
మొదటిసారి ఒక సినిమా కోసం హైదరాబాద్ తో పాటు బెంగుళూరు – కోల్ కత్తా – ముంబై – ఢిల్లీ – గుజరాత్ వంటి ప్రముఖ పట్టణాల్లో అమీర్ ఖాన్ దర్శనమివ్వనున్నాడు. అతుల్ కులకర్ణి రాసిన ఈ సినిమా కథను అద్వైత్ చందన్ డైరెక్ట్ చేయనున్నాడు.


