మెగాస్టార్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అదే తరహాలో స్టార్ హీరోలు కూడా ఈ హిస్టారికల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి సైరా నరసింహా రెడ్డి పై స్పందించి మెగా అభిమానుల్లో జోష్ నింపారు.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ని చూసిన మహేష్ విజువల్స్ కి ఫిదా అయినట్లు ట్వీట్ చేశాడు. “అసాధారణమైన విజువల్స్. ట్రైలర్ యొక్క ప్రతి ఫ్రేమ్లో ఈ చిత్రం యొక్క గొప్పతనం స్పష్టంగా కనిపిస్తుంది! చిరంజీవి గారు సూపర్ గా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి – రత్నవేలు అలాగే మొత్తంగా చిత్ర యూనిట్ గొప్పగా వర్క్ చేశారు” అని అన్నారు. చివరగా సైరా నరసింహ రెడ్డి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మహేష్ పేర్కొన్నారు. ఇక సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.