ఆస్కార్ నామినేషన్స్ లో మన రైతు కథ

0
782

ఆస్కార్ బరిలో ప్రతి సారి భారత సినిమాలు పోటీపడుతూనే ఉన్నాయి. పోటీ ఎలా ఉన్నా మంచి కాన్సెప్ట్స్ తో కొన్ని అరుదైన సినిమాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అదే తరహాలో భారతదేశానికి చెందిన ఒక సాధారణ రైతు కథ ఆస్కార్ పోటీలో నిలిచింది. మోతీభాగ్ అనే డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అధికారికంగా తెలిపారు.

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని వ్యవసాయ పనులు తగ్గుతున్న సమయంలో ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా వ్యవసాయాన్ని కొనసాగించాడు. అద్భుతంగా పంటలను పండించి దేశాన్ని ఆకర్షించాడు. అదే కథను డాక్యుమెంటరిగా నిర్మల్ చందర్  తెరకెక్కించారు. ఇప్పుడు ఆ కథ బెస్ట్ డాక్యుమెంటరీ విభాగాల్లో ఆస్కార్ పోటీలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here