మాస్ మహారాజ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ డిస్కో రాజా. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల వినాయక చవితి కానుకగా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ఈ సినిమా తాజా షెడ్యూల్ ఐస్ ల్యాండ్ లో జరుగుతున్నట్లు సినిమా నిర్మాతలైన ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ వారు కాసేపటి క్రితం కొందరు సినిమా యూనిట్ సభ్యులు కలిసి ఐస్ ల్యాండ్ లో దిగిన ఒక ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు యూనిట్ సభ్యులు……!!