రోమాంచితంగా మెగాస్టార్ ‘సైరా’ థియేట్రికల్ ట్రైలర్ …..!!

0
729

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు సినిమా యూనిట్. నరసింహారెడ్డి సామాన్యుడు కాడు, అతను కరణ జన్ముడు. అతనొక యోగి, యోధుడు అతన్ని ఎవరూ ఆపలేరు అంటూ బ్యాక్ గ్రౌండ్లో వచ్చే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

‘ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కాట్టాలిరా శిస్తు’ అంటూ మెగాస్టార్ పలికే డైలాగ్ స్ప్హూర్తి రగిలిస్తుంది . ఇక ‘స్వతంత్రం కోసం జరుగుతున్న ఈ తొలి యుద్ధంలో నువ్వు గెలవాలి’ అంటూ అమితాబ్, అలానే ‘నీ గెలుపుని కళ్లారా చూడాలని వచ్చాను సైరా నరసింహారెడ్డి’ అంటూ సుదీప్, ‘వీరత్వానికి పేరైన తమిళ భూమి నుండి వచ్చాము, రాముడికి లక్ష్మణుడి మాదిరి ఎప్పుడూ ఉంటాము, అది విజయమో వీర స్వర్గమో’ అంటూ విజయ్ సేతుపతి’ పలికే డైలాగ్స్ తో స్వాతంత్య్ర తొలి పోరాటంలో నరసింహా రెడ్డి అనుచరులెవరో పరిచయం చేశారు . ఇక ట్రైలర్ లో చివరిలో నీ చివరి కోరిక ఏదైనా ఉందా అని బ్రిటిషర్లు అడగగా, గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ అంటూ మెగాస్టార్ పవర్ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు.

డైలాగ్స్ తో పాటు అత్యద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్ తో మొత్తంగా ఈ ట్రైలర్సినిమా మీదున్న అంచనాలని మరింత పెంచేలా ఉంది . మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 22 న హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో గ్రాండ్ గా జరగనుండగా, సినిమాను అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here