విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఫిల్మ్ టైటిల్ ఎనౌన్స్మెంట్

0
767

రౌడీ బాయ్ గా టాలీవుడ్ లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తన 9వ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా చివరి దశకు చేరుకుంటోంది. డియర్ కామ్రేడ్ అనంతరం తీరిక లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ ఈ సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేట్ ని రెడీ చేశాడు.

సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కి మంగళవారం ఉదయం 11గంటలకు టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నాడు. సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here