డిస్కో రాజా యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 టీం

0
685

మాస్ మహారాజ్ రవి తేజ హీరో గా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతకం పై టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ప్రముఖ నిర్మాత రామ్ తళ్ళూరి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది. బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను చిత్రీకరిస్తున్న చిత్ర బృందం, తాజాగా గోవా లో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని వచ్చింది. మాస్ మహారాజ్ రవి తేజ కెర్రిర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు గా డిస్కో రాజా టీం చెబుతుంది. ఈ నేపథ్యంలో గోవ షెడ్యూల్ ముగించుకొని ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్ లోని ఐస్ ల్యాండ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించాడనికి ప్లాన్ చేసినట్లు చెప్పారు. ఈ షెడ్యూల్ కోసం భారీ గా ఖర్చు చేస్తున్నట్లు గా డిస్కో రాజా టీం చెబుతుంది.

నాలుగు నిముషాల సన్నివేశం కోసం 4 – 5 కోట్ల ఖర్చు

ఐస్ ల్యాండ్ లో షూట్ చేయబోతున్న కొన్ని కీలక సన్నివేశాల కోసం ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ గా ఖర్చు చేయబోతున్నారు. నిర్మాత రామ్ తళ్ళూరి దర్శకుడు వి ఐ ఆనంద్ విజన్ కి తగినట్లుగా బడ్జెట్ విషయం లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిస్కో రాజా ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఐస్ ల్యాండ్ లో సెప్టెంబర్ 17 నుంచి జరగబోతున్న షెడ్యూల్ ని దాదాపు 4 – 5 కోట్ల రూపాయలు బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఐతే ఈ కీలక సన్నివేశం డిస్కో రాజా సినిమా లో కేవలం నాలుగు నిముషాల నిడివి మాత్రమే ఉండటం కొస మెరుపు.

డిస్కో రాజా కోసం ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 టీం

ఐస్ ల్యాండ్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫాస్ట్ అండ్ ఫురియెస్ 7 కోసం పనిచేసిన యాక్షన్ స్టంట్ మాస్టర్స్, అలానే పలు ఇంటర్నేషనల్ సినిమాలకు పనిచేసిన ఊలి టీం డిస్కో రాజా కోసం రంగం లోకి దిగబోతున్నారు. సినిమా కి హైలైట్ గా ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని డిస్కో రాజా టీం చెబుతుంది.

డిస్కో రాజా కి గ్రాఫిక్స్ హంగులు

మాస్ మహారాజ్ రవి తేజ సరసన పాయల్ రాజ్ పుత్, నన్ను నభా నటేష్, హాట్ బ్యూటీ తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర పనితనం, నవీన్ నూలి ఎడిట్ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడు, బాబీ సింహా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ప్రీ లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా డిస్కోరాజా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here