బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అయితే ఆ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అజయ్ దేవగన్ రాజమౌళి RRR సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో అజయ్ సినిమాలపై ఎప్పటికప్పుడు టాలీవుడ్ జనాలు కూడా ఒక కన్నేసి ఉంచుతున్నారు.
ఇక ఇప్పుడు ఈ సీనియర్ హీరో జూనియర్ బచ్చన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ద బిగ్ బుల్’ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాను సోమవారం లాంచ్ చేశారు.ఫెమస్ స్టాక్ బ్రోకర్ జీవిత ఆధారంగా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలియానా కూడా ఒక ముఖ్య పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ ఏడాది ఎండింగ్ లో చిత్ర యూనిట్ ద బిగ్ డల్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టనున్నారు.


