ఎప్పటికి మరచిపోలేని ఖుషి కథతో అన్ని ఇండస్త్రీలల్లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు SJ సూర్య. డైరెక్టర్ గా బ్రేక్ తీసుకున్న సూర్య ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తెచ్చిన సూర్య ఇప్పుడు మరో సినిమాను లాంచ్ చేశాడు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాధా మోహన్ ఎస్ జె.సూర్య కొత్త తరహా రొమాంటిక్ థ్రిల్లర్ ను ట్రై చేయబోతున్నాడు.
ఆకాశమంత – గగనం – గౌరవం వంటి సినిమాలతో రాధా మోహన్ అప్పట్లో తెలుగు ఆడియెన్స్ ని కూడా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్నాడు. SJ సూర్య సొంతంగా నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో మొదలుకనుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని SJ సూర్య టార్గెట్ సెట్ చేసుకున్నాడు.


