సిద్దమైన రాజుగారి గది 3 ట్రైలర్

0
698

రాజుగారి గది సినిమాతో సింపుల్ గా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు ఓంకార్ సెకండ్ సీక్వెల్ తో కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి భయంతో సరికొత్తగా నవ్వించడానికి రాజుగారి గది 3తో రెడీ అవుతున్నాడు. అవికా గోర్ సినిమాలో డిఫరెంట్ లుక్ లో నటిస్తోంది. ఓంకార్ సోదరుడు అశ్విన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే సినిమా ట్రైలర్ సిద్ధమైంది.

దగ్గుబాటి హీరో విక్టరీ వెంకటేష్ స్పెషల్ గా రాజుగారి గది 3 ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఆదివారం 11గంటల 30 నిమిషాలకు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్ని రోజులుగా చిత్ర యూనిట్ ట్రైలర్ ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది. ఇక త్వరలో సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనున్నారు. సినిమాలో అవికా గోర్ పాత్ర పై ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్ ఇప్పటికే ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. మరి ట్రైలర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here