మెగాస్టార్ కెరీర్ లొనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ పై ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. చిత్ర యూనిట్ ముందు నుంచి సినిమాలో VFX వర్క్స్ అందరిని ఆకట్టుకుంటాయని చెబుతోంది.
ఇక రీసెంట్ గా తెలిసిన విషయం ఏమిటంటే సినిమాలో VFX వర్క్స్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి 17 దేశాల వరకు తిరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్ లో వచ్చే విజువల్స్ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లనున్నాయట. విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. స్క్రీన్ పై ఉయ్యాలవడా నరసింహా రెడ్డిగా మెగాస్టార్ క్రేజ్ ని మరింత పెంచేలా రామ్ చరణ్ తీసుకున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. ఫైనల్ గా చిత్ర యూనిట్ అవుట్ ఫుట్ తో రెడీ అయ్యింది.


