గ్యాంగ్ లీడర్ సినిమాలో ఎవరు ఊహించని విధంగా అతిధి పాత్రలో కనిపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ గా సినిమా పై స్పందించాడు. ముందుగా సుక్కు బిగ్ స్క్రీన్ పై తనను తాను చూసుకుంటూ చాలా మురిసిపోయాడు. సినిమాను వీక్షించిన అనంతరం సుకుమార్ చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా కలుసుకున్నారు. వారితో కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ గొప్పగా వర్క్ చేసినట్లు ప్రశంసించారు.
సినిమాలో ఒక పాత్రలో నటించినందుకు సంతోషంగా ఉందని గ్యాంగ్ లీడర్ టీమ్ తో ఒక ఫొటోకి స్టిల్ కూడా ఇచ్చారు. సినిమా చివరలో కథానాయకుడు నాని రాసిన కథ కోసం వచ్చే సుక్కు పాత్ర ఆడియెన్స్ ని నవ్వులతో థియేటర్ నుంచి బయటకు రప్పించింది. ఆ సీన్ హైలెట్ గా నిలిచింది.


